- రాణించిన క్లాసెన్, కమిన్స్
- బ్రెవిస్, కార్తీక్ శ్రమ వృథా
- గుజరాత్ కూడా నాకౌట్‌కు
ఆల్‌రౌండ్‌తో షోతో ఆకట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఛేజింగ్‌లో ఇషాన్ కిషన్ ( 70), హెన్రిచ్ క్లాసెన్ (47) చెలరేగడంతో.. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 5 వికెట్ల తేడాతో చెన్నైపై గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 180/7 రన్స్ చేసింది. డేవ్లాడ్ బ్రెవిస్ (44), కార్తీక్ శర్మ (32) రాణించారు. తర్వాత హైదరాబాద్ 19 ఓవర్లలో 181/5 రన్స్ చేసి గెలిచింది. 16 పాయింట్లతో రెండో ప్లేస్‌లో ఉన్న గుజరాత్ కూడా నాకౌట్‌కు అర్హత సాధించింది.
చెన్నై: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్–19లో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఛేజింగ్‌లో ఇషాన్ కిషన్ (47 బాల్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70), హెన్రిచ్ క్లాసెన్ (26 బాల్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47) చెలరేగడంతో.. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 5 వికెట్ల తేడాతో చెన్నైపై గెలిచింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 180/7 స్కోరు చేసింది. డేవ్లాడ్ బ్రెవిస్ (27 బాల్స్‌లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44), కార్తీక్ శర్మ (19 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) రాణించారు. తర్వాత హైదరాబాద్ 19 ఓవర్లలో 181/5 స్కోరు చేసింది. ఇషాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. 16 పాయింట్లలో రెండో ప్లేస్‌లో ఉన్న గుజరాత్ కూడా నాకౌట్‌కు అర్హత సాధించింది.
శాంసన్‌కు కమిన్స్ బ్రేక్
ఫ్లాట్ వికెట్‌పై ఓపెనర్ శాంసన్ (27) సీఎస్కేకు మెరుపు ఆరంభాన్నిచ్చాడు. నితీశ్ కుమార్ వేసిన తొలి ఓవర్‌లోనే 6, 4, 4తో 17 రన్స్ దంచాడు. ప్రఫుల్ హింగే (1/37) వేసిన తర్వాతి ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. కానీ మూడో ఓవర్‌లో కమిన్స్ (3/28) వేసిన ఔట్‌సైడ్ లెంగ్త్ డెలివరీ శాంసన్ బ్యాట్‌ను టచ్ చేస్తూ కీపర్ చేతుల్లోకి వెళ్లింది.
తొలి వికెట్‌కు 31 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఉర్విల్ పటేల్ (13) బ్యాక్ టు బ్యాక్ సిక్స్‌లు కొట్టినా.. ఐదో ఓవర్‌లో షకీబ్ హుస్సేన్ (2/34)కు వికెట్ ఇచ్చాడు. స్కోరు 48/2గా మారింది. రుతురాజ్ గైక్వాడ్ (15), కార్తీక్ శర్మ నిలకడగా ఆడటంతో పవర్‌ప్లేలో చెన్నై 57/2 స్కోరు చేసింది. ప్రఫుల్ వేసిన 8వ ఓవర్‌లో కార్తీక్ 4, 6, 4తో 16 రన్స్ రాబట్టాడు.
తర్వాతి ఓవర్‌లో మరో సిక్స్ దంచినా.. 10వ ఓవర్‌లో కమిన్స్ బ్రేక్‌లు వేశాడు. మూడో వికెట్‌కు 42 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగియడంతో పాటు ఫస్ట్ టెన్‌లో సీఎస్కే 91/3తో నిలిచింది. అప్పటివరకు సహచరుల బ్యాటింగ్‌ను చూసిన రుతురాజ్‌ను 12వ ఓవర్‌లో కమిన్స్ పెవిలియన్‌కు పంపాడు.
స్కోరు 100/4గా మారింది. సిక్స్‌తో ఖాతా తెరిచిన బ్రెవిస్ 14వ ఓవర్‌లో 4, 4, 6తో 18 రన్స్ రాబట్టాడు. శివమ్ దూబే (26) సిక్స్‌తో స్కోరు 15 ఓవర్లలో 132/4కు పెరిగింది. తర్వాతి ఓవర్లలో 6, 4, 6 కొట్టిన బ్రెవిస్ 18వ ఓవర్‌లో వెనుదిరిగాడు. మరో ఫోర్ కొట్టి దూబే 19వ ఓవర్‌లో ఔటయ్యాడు. ప్రశాంత్ వీర్ (11) రెండు ఫోర్లు రాబట్టాడు. దాంతో చివరి ఐదు ఓవర్లలో 48 రన్స్ రావడంతో సీఎస్కే మంచి టార్గెట్‌ను
నిర్దేశించింది.
ఇషాన్ సూపర్..
ఛేదనలో హైదరాబాద్ ఓపెనర్లను కట్టడి చేయడంలో సక్సెస్ అయిన సీఎస్కే బౌలర్లు తర్వాత చేతులెత్తేశారు. అభిషేక్ (26) రెండు ఫోర్లతో టచ్‌లోకి రాగా, బౌండ్రీ బాదిన ట్రావిస్ హెడ్ (6)ను మూడో ఓవర్‌లో ముకేశ్ చౌదరీ (2/36) ఔట్ చేశాడు.
నాలుగో ఓవర్‌లో ఇషాన్ కిషన్ నాలుగు ఫోర్లతో బ్యాట్ ఝుళిపించాడు. తర్వాత అభిషేక్ ఫోర్, ఇషాన్ సిక్స్‌తో పవర్‌ప్లేలో ఎస్‌ఆర్‌హెచ్ 45/1 స్కోరు చేసింది. ఏడో ఓవర్‌లో సిక్స్ కొట్టిన అభిషేక్‌ను తర్వాతి ఓవర్‌లో అకీల్ హుస్సేన్ (1/21) పెవిలియన్‌కు పంపాడు. దాంతో రైజర్స్ 56/2తో ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో వచ్చిన క్లాసెన్ అద్భుతంగా ఆడాడు. బౌండ్రీతో టచ్‌లోకి వచ్చిన అతను పదో ఓవర్‌లో 4, 6తో బ్యాట్ ఝుళిపించాడు. దాంతో స్కోరు 75/2కు పెరిగింది. నూర్ అహ్మద్ (1/40) వేసిన 11వ ఓవర్‌లో 6, 4 కొడితే అవతలివైపు ఇషాన్ 4, 6, 4 దంచాడు. 14వ ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టిన క్లాసెన్‌ను తర్వాతి ఓవర్‌లో శాంసన్ స్టంపౌట్ చేశాడు. ఫలితంగా మూడో వికెట్‌కు 75 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఇషాన్‌కు తోడైన నితీశ్ రెడ్డి (11) నిలకడగా ఆడాడు.
15 ఓవర్లలో స్కోరు 137/3గా మారింది. ఈ క్రమంలో ఇషాన్ 37 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. తర్వాతి రెండు ఓవర్లలో 16 రన్స్ రావడంతో ఎస్‌ఆర్‌హెచ్ విజయ సమీకరణం 18 బాల్స్‌లో 28గా మారింది. ఈ దశలో ముకేశ్.. నితీశ్‌ను ఔట్ చేసి షాకిచ్చాడు. నాలుగో వికెట్‌కు 22 రన్స్ జతయ్యాయి. సలీల్ అరోరా (10 నాటౌట్)తో కలిసి ఇషాన్ 4, 6తో సమీకరణాన్ని 12 బాల్స్‌లో 13గా మార్చేశాడు. వెంటనే అరోరా 6 కొట్టినా.. ఇషాన్ ఔటయ్యాడు. చివర్లో స్మారన్ రవిచంద్రన్ (5 నాటౌట్), అరోరా ఈజీగా విజయాన్ని అందించారు.
సంక్షిప్త స్కోర్లు
చెన్నై: 20 ఓవర్లలో 180/7 (బ్రెవిస్ 44, కార్తీక్ శర్మ 32, కమిన్స్ 3/28). హైదరాబాద్: 19 ఓవర్లలో 181/5 (ఇషాన్ 70, క్లాసెన్ 47, ముకేశ్ 2/36).
